
మరికొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ మొదలు కానుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుందని ఈసీ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బూత్‌ల దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం రెడీ చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇప్పటికే పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్లారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండా రాష్ట్ర పోలీసులతో పాటుపారామిలటరీ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు..
-
30 Nov 2023 06:27 AM (IST)
పూర్తైన మాక్ పోలింగ్
రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్.. బూత్ ఏజెంట్లు లేని పక్షంలో 5.45 నిమిషాలకు మాక్ పోలింగ్ ప్రారంభించి ఈవీఎంల పని తీరును పరిశీలించిన ఎన్నికల సిబ్బంది.. తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు రావాల్సి ఉన్న పోలింగ్ ఏజెంట్లు, కానీ కొన్ని కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండానే మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి..