Leading News Portal in Telugu

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్!


తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిల్చొని ఓటేస్తున్నారు.

పోలింగ్‌ సందర్భంగా మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలన్నారు. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలని పేర్కొన్నారు. మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మీ ఓటు..
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలి

మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలి

మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలి

మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలి

మీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలి

మీ…

— KTR (@KTRBRS) November 30, 2023