
Congress Filed Complaint on MLC Kavitha: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై భారత ఎన్నికల సంఘం (ఈసీ)కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కవిత ఓటేసిన అనంతరం బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని పేర్కొంటూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు.
‘ఎమ్మెల్సీ కవిత గారు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఈరోజు తన ఓటును వినియోగించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. దయచేసి ఆమెపై చర్యలు తీసుకోండి’ అని ఛైర్మన్ నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.