
Elections Duty Employee dies due to heart attack: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్ గ్రామం (248) పోలింగ్ బూత్ విధుల్లో ఉన్న సుధాకర్ అనే వ్యక్తి బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
ఎన్నికల విధుల్లో భాగంగా సుధాకర్ బుధవారం మధ్యాహ్నం ఇస్నాపూర్ గ్రామంకు చేరుకున్నారు. రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. అతడికి తోటి ఉద్యోగులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల అధికారులు ఉదయం కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నరీ విభాగంలో సుధాకర్ సహాయకుడిగా పని చేస్తున్నారు.