Leading News Portal in Telugu

Telangana Elections 2023: కుమురం భీం జిల్లాలో రాళ్ల దాడి… పోలీసులకు తీవ్ర గాయాలు.


Telangana Elections 2023: కుమురం భీం జిల్లాలో రాళ్ల దాడి… పోలీసులకు తీవ్ర గాయాలు.

Telangana Elections 2023 Attack at Sirpur Kagajnagar: తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 40 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించగా దీంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే ఇదిలా ఉండగా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని 90వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద ఈ ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఏజెంట్లు ఏకపక్షంగా ఓట్లు వేయిస్తూన్నారని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బీఎస్పీ నాయకుడు బైఠాయించారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్‌ అంటే..?

సిసి టివి ఫుటేజ్ బయటపెట్టాలి, 90వ పోలింగ్ బూత్ లో రీ ఎలక్షన్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్,.బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అనుకూల-ప్రతికూల నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు చెప్పులు రాళ్లతో దాడి చేసుకోగా పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఎన్నికల విధుల్లో ఒక డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ గంగన్న సహా మరో కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ఆశలకి బ్రేకులు పడ్డాయి. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.