Leading News Portal in Telugu

Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీలో అంశాలు ఇవే..


Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీలో అంశాలు ఇవే..

నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ఏపీ పోలీసులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అంశాలు ఏమున్నాయంటే..

నాగార్జున సాగర్‌, విజయపురి టౌన్‌ పీఎస్‌లో కేసు
A-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ కేసు
తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని ఫిర్యాదు చేసిన తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌
500 మంది సాయుధ బలగాలతో సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు
ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు
కుడికాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారు
కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసుల ఫిర్యాదు
447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు

TS Cabinet: ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం