
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై కూడా రాహుల్ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం హైదరాబాద్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ వస్తున్నారు.