Leading News Portal in Telugu

KTR Tweet: హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెలుపు ధీమాపై మరో ట్వీట్


KTR Tweet: హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెలుపు ధీమాపై మరో ట్వీట్

KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే.. ఆయా పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా.. ఎవరి విజయంపైనా వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువగా కాంగ్రెస్ కు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా.. అటు బీఆర్ఎస్ కూడా, తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇలా.. తమ పార్టీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌. అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని, ఇంతకుముందు కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వచ్చాయన్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయని ఉదయం ఒక ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత నిన్న రాత్రి బాగా నిద్రపోయానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని.. కౌంటింగ్ లో మంచి ఫలితాలు వస్తాయని కేటీఆర్ వివరించారు.

Whatsapp Image 2023 12 02 At 9.19.45 Pm