
మేడిగడ్డ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు. నాలుగు పిల్లర్లు కూలితే తప్పా అంటున్నాడు కేసీఆర్ అని, నీ తప్పులకు నువ్వు శిక్ష వేసుకునే అంతటి వాడివి కాదు అని తెలుసు అని అన్నారు. కేసీఆర్ మేడిగడ్డని చులకన చేస్తున్నాడని, శాసన సభలోనే krmb మీద సలహాలు ఇవ్వండి అనే సభ పెట్టినమన్నారు. నువ్వు కూడా వచ్చి ఇవ్వాల్సిందన్నారు. మా తీర్మానం సక్కగా లేకుంటే.. మీ స్వాతిముత్యం అల్లుడు ఎందుకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. సభలో నేను అప్పుడే చెప్పిన..హరీష్ మాటకు విలువ లేదు అని, సరిగ్గా కేసీఆర్ కూడా అదే అన్నాడన్నారు. హరీష్ లాంటోళ్లకు brs లో విలువ లేదు అని నిరూపితం అయ్యిందని, సభకు వచ్చి అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోంది అని ప్రతిపాదన పెట్టు అని ఆయన అన్నారు. మేము సలహా తీసుకుంటామన్నారు. కేసీఆర్.. బెదిరించి బతకాలని చూస్తున్నాడని, నువ్వు వెంటాడితే.. మేము అల్లాటప్పగా కుర్చీ ఎక్కలేదు.. మంది పిల్లల ప్రాణాల మీద అధికారంలోకి నీలగా రాలేదన్నారు.
INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్‌లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..
అంతేకాకుండా..’కాళేశ్వరం అవినీతిలో నీకు సంబంధం లేకుంటే. ఎందుకు సభకు రావడం లేదు. అన్నారం మీద..మేడిగడ్డ పై ఎందుకు నోరు మెదపలేదు. అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకు సభలు పెట్టుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చారు జనం. సభకు రాకుండా ఎక్కడ పోతావు కేసీఆర్. సభకు రాకుండా పారిపోయింది మీరు. కేసీఆర్ కి కుర్చీ పోగానే.. ఫ్లోరైడ్.. గుర్తుకు వచ్చింది.. నీళ్లు గుర్తుకు వచ్చింది ఆయనకు.. కేసీఆర్ నువ్వు సభకు రా.. నీ గౌరవం తగ్గించము.. మీరు ఏ సూచన ఇచ్చినా స్వీకరిస్తాం.. శ్వేతపత్రం ప్రవేశ పెడతాం రండి సలహా.. సూచన ఇవ్వండి. Krmb కి ప్రాజెక్టు లు ఇచ్చే క్రమంలో.. ఏనుగు పోయింది తోక మిగిలింది. ఏనుగు ను ముంచింది మీరు.. తోక అయినా పట్టుకుని కాపాడాలని మేము చూస్తున్నాం. అది కూడా వద్దు అన్నట్టు కేసీఆర్ వ్యవహారం. మేడిగడ్డ 5 ఫీట్లు కుంగిపోయింది. నీళ్లు నింపితే.. ప్రమాదం.. చిన్న తప్పు అన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. L&T బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా. మేడిగడ్డ కుంగిపోయింది.. దాని మీద ని పార్టీ స్టాండ్ ఏంది..? సభకు వచ్చి చెప్పు.. కేసీఆర్ కుర్చీ పోయింది అని వెతుక్కుంటూ నల్గొండ పోయిండు.. పార్లమెంట్ సీట్లలో గెలవాలని సానుభూతి కోసం కేసీఆర్ ఎత్తుగడ.. నల్గొండ ప్రజలు నిన్ను క్షమించరు.. వీల్ చైర్ కి వచ్చిండు కేసీఆర్. సానుభూతి కోసం.. పచ్చిగా పట్టుబడి.. భయపడ అంటున్నాడు కేసీఆర్.. ఎవడు భయపడుతున్నాడు.. రా సభకు..భయపడక పోతే.. స్పీకర్ కూడా మీకు ఫుల్ మైక్ ఇత్తరు రా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం