Leading News Portal in Telugu

TS RERA : ‘రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు ఇస్తే ఇక చర్యలే


TS RERA : ‘రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు ఇస్తే ఇక చర్యలే

`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి మార్కెటింగ్ కార్యక్రమాలు నిర్వహించడo పట్ల నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి అధికారులు నోటీసులు ఇచ్చారు.


 
Politicians Love Story: ప్రముఖ రాజకీయ నాయకుల ప్రేమకథలు తెలుసా?

దీంతో పాటు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల చెరువు గ్రామంలోనీ GRR హైవే కౌంటీ ప్రాజెక్ట్, కూసుమంచి మండలం మునిగే పల్లి గ్రామంలో ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రకటనలు జారీ చేస్తూ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇండో క్వటార్ ప్రాజెక్టుకు, అబ్దుల్లాపూర్ మండలం అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారంలో రేరా’ అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపడుతున్న అనంత వనస్థలి హిల్స్ ప్రాజెక్టుకు షోకాజు నోటీసు జారీ చేశారు. ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా హైదరాబాద్ లో పలు ప్రాజెక్టులు చేపట్టెందుకు వ్యాపార ప్రకటనలు జారి చేస్తున్న గో గ్రీనే గ్రూప్ ప్రాజెక్టుకు రేరా నిబంధనల అతిక్రమించినందుకు గాను నోటీసులిచ్చారు. అయితే.. రేరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రకటనలు జారీచేయడం, మార్కెటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ‘రెరా’ చట్ట ప్రకారం నిషేదమని, నిబంధనలు ఉల్లంగించిన ప్రాజెక్టులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని రెరా అధికారులు వెల్లడించారు. GHMC, HMDA, DTCP, UDA, ఇతర స్ధానిక సంస్థల నుండి అన్ని అనుమతులు పొందిన పిదప ‘రెరా’లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు విదీగా రిజిష్టర్ కావాలని, అట్టి రిజిస్ట్రేషన్ నంబర్ తప్పని సరిగా సదరు వ్యాపార ప్రకటనలలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.

Congress: రాజ్యసభకు సోనియా.. ఏ రాష్ట్రం నుంచంటే..!