Leading News Portal in Telugu

MLA Maheshwar Reddy : బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు.. చేయదు కూడా


MLA Maheshwar Reddy : బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు.. చేయదు కూడా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు. చేయదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయీ, భవిష్యత్ లోనూ పని చేస్తాయి. కలిసి పని చేయమని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని, గతంలో పీసీసీ అధ్యక్షులుగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారన్నారు. సీఎం తో పాటు, మేడిగడ్డ పర్యటన పిక్నిక్ వెళ్ళి లంచ్ చేసి వచ్చారని, కాళేశ్వరం పర్యటన గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి పర్యటించారన్నారు మహేశ్వర్‌ రెడ్డి. కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే..48 గంటల్లో కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు మహేశ్వర్‌ రెడ్డి.


Domestic Violence: తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింస ఎలా అవుతుంది.? భార్య పిటిషన్ కొట్టేసిన కోర్టు..

అంతేకాకుండా.. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని, గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం తప్పులపై సీబీఐ ఎంక్వైరీ కోరడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటీ…? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు.. అలా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని, గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం తప్పులపై సీబీఐ ఎంక్వైరీ కోరడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటీ…? అని ఆయన అన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని, సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు.. అలా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి. ప్రజల మభ్యపెట్టే మోసపూరిత బడ్జెట్ అని, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్నారు.

Seethakka Vs Kavitha: రాహుల్ యాత్ర బస్సు రేవంత్ వాడిందే.. కవితకు సీతక్క కౌంటర్