
రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లు మోడీ చేసినవి కాదు… విభజన చట్టం లో ఉన్నవన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. KRMB కి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని ఆయన వెల్లడించారు. నదీ జలాల పంపిణీ అనేది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదని, ట్రిబ్యునల్ కు మాత్రమే అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో స్థానం లేదు…డిపాజిట్ తెచ్చుకోవడం కోసం , ఉనికి కోసం కెసిఆర్, కాంగ్రెస్ దొంగ నాటకాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. SLBC పూర్తి చేస్తా అని కేసీఆర్ డైలాగ్ లు కొట్టారు.. ద్రోహం చేశారని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు కేసీఆర్ అని మురళీధర్ రావు మండిపడ్డారు. దిండి ఎత్తిపోతల పథకం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు
జూరాల ప్రాజెక్టు పై ఎందుకు మాట మార్చావు కేసీఆర్ అని, తెలంగాణ ప్రజలు కెసిఆర్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తే… మీరు చేసిందేమీలేదన్నారు. తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు చిత్త శుద్ది చూపలేదని, దక్షిణ తెలంగాణా ప్రజల్ని నిర్లక్ష్యం చేశాడు కేసీఆర్ అని ఆయన అన్నారు. KRMB విషయం లో తీర్మానం ఎవరికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసిందని,
కాళేశ్వరం అవినీతి అఖండ అవినీతి అని ఆయన ఆరోపించారు. రెండు పార్టీ లు కుమ్మక్కై దోపిడీ కి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జ్ ఇలాంటి కేసులను విచారణ చేయరన్నారు. రిటైర్డ్ జడ్జి చేసే విచారణ కు న్యాయబద్దత ఉండదు…విచారణ సంస్థలు మాత్రమే చేయాలని, నాటకాలు ఆడితే ప్రజలే సన్యాసం ఇస్తాన్నారు.
Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు