
Pending Challans: గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో సబ్సిడీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు ఇవాళ (గురువారం) అర్ధరాత్రితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వాహనాల చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగించేది లేదని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్ల చెల్లింపు గడువు నేటి అర్ధరాత్రి 11:59 గంటలతో ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీని కల్పించింది. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించింది. ఇకపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్లపై 80 శాతం తగ్గింపును ప్రకటించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం తగ్గింపును ప్రకటించింది. ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వం 90 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే..
Read also: Electoral bonds: ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి..?
హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్ మూడు కమిషనరేట్లతో పాటు జిల్లా కేంద్రం నుంచి మొదలుకొని రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లతోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై నగరంలోని పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది నుంచి చలాన్లు వసూలు చేస్తున్న చాలా మంది చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో చెల్లించని చలాన్ల కారణంగా పెండింగ్‌లో ఉన్న చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కోవిడ్ కారణంగా వాహన యజమానులు పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించలేకపోయారు. కొన్ని వాహనాలకు వాటి విలువ కంటే ఎక్కువ చలాన్లు ఉంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడు కమిషనరేట్ల పరిధిలోని వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది.
Chiranjeevi Political Re-Entry: సీఎం అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశం.. ఆయన రాకపోతే..!