
Robbery in Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డున చాదర్ ఘాట్ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు షాపు యజమాని కుమారుడిపై కత్తులతో దాడి చేసి బంగారు ఆభరణాలను అపహరించారు. కస్టమర్ గా వచ్చిన మరొకరు వీరికి సహకరించారనే అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు సీసీ ఫోటేజ్ ఆధారంగా దోపిడీకి పాల్పడిన ముగ్గురుని అదుపులో తీసుకున్నారు.
Read also: Virat Kohli-BCCI: అది హక్కు.. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ!
అసలేం జరిగింది అంటే….
హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ ఉల్రా హమాన్ చాదర్ ఘాట్‌లోని అక్బర్ చౌరస్తాలో కిస్వా జ్యువెలర్స్ పేరుతో వెండి, బంగారు ఆభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఉల్ రహమాన్ కుమారుడు సజావుర్ రహమాన్ దుకాణంలో ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ యువకుడు దుకాణానికి వచ్చి వెండి గొలుసు కావాలని రెహమాన్‌ను అడిగాడు. అనంతరం గొలుసులను చూపించాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి… నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చి షాపు దగ్గర ఆగింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షాపులోకి ప్రవేశించి తమ వద్ద ఉన్న కత్తులను బయటకు తీశారు. వెండి గొలుసులను పరిశీలిస్తున్న వినియోగదారుడిని పక్కకు నెట్టి సజావూరుపై కత్తితో దాడికి యత్నించారు. దుండగులను అడ్డుకునే క్రమంలో అతడి ఎడమచేవి ,ఎడమ చేయికి తీవ్ర గాయాలయ్యాయి. సజావూరు కింద పడిపోయాడు. అప్పటికే తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో బంగారు ఆభరణాలను వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
Read also: CPI Narayana: ఫిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అంటారా..? నారాయణ ఫైర్
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు దుండగులు పాతబస్తీ వైపు నుంచి కమటిపుర ఫ్లైఓవర్ మీదుగా చాదర్ ఘాట్‌కు వచ్చి దోపిడి చేసి తిరిగి అదే దారిలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు షాపులోకి చొరబడకముందు కస్టమర్‌గా ఉన్న యువకుడు కూడా ఈ ముఠాలో భాగమేనని పోలీసులు అనుమానం బలంగా మారింది. దొంగలు ఆ యువకుడి దగ్గరికి రాలేదు. కొద్దిదూరం నడవని యువకుడు. అక్బర్ బాబు చౌరస్తా దగ్గర ఆటో ఎక్కి మలక్ పేట డి మార్ట్ లో దిగాడు. అక్కడి నుంచి మరో ఆటో ఎక్కి మీర్ చౌక్ కు వెళ్లాడు. అప్పుడు యువకుడి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. సంఘటనా స్థలానికి వచ్చిన సౌత్ ఈస్ట్ ఎస్డీ సీపీ జానకీ ధరావత్ మలక్ పేట్ ఏసీబీ శ్యాంసుందర్ వివరాలు రాబట్టారు. వెంటనే దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ఇవాళ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సజావూరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
YSRCP Rebel MLAs: స్పీకర్‌కు లేఖ రాసిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు