
CPI Narayana: ఫిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అంటారా..? అని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే.. ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. ఫిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అనడమెంటి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశావా.. చెపరాసి నౌకరీ చేశావా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు శాశ్వతంగా రామని బైకాట్ చేయడమెంటి అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఎందుకు పోటీ చేశారు.. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజా సంపాదనను పందికొక్కులా తింటూ అసెంబ్లీకి పోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ నుంచి గెంటివేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. తెలంగాణ భాజపా బాగా తెలివైనది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐకీ అప్పగించాలని కోరుతుందన్నారు. సీబీఐకి కేసు అప్పగించి మ్యానేజ్ చెయ్యాలి అనుకుంటుందన్నారు. తెలంగాణ బిజెపి కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు.
Read also: Virat Kohli-BCCI: అది హక్కు.. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ!
వేల కోట్ల అవినీతికి కేసీఆర్ బాధ్యుడు..కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొన్నటి దాకా భారాస వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు.. అవినీతి చేసింది బీఆర్ఎస్ నేతలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీష్ రావు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ తపన పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి ఎలక్ట్రోలు బాండ్ల రూపంలో నల్ల డబ్బు చేరుతుందన్నారు. ఈ దేశంలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ లేకే ఎలక్ట్రోడ్లో బాండ్ల రూపంలో ఎక్కువ మొత్తంలో చేరిందన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు ఆందోళన చేపట్టారన్నారు. దేవులను ఒక వైపు పూజిస్తూ..మరో వైపు రైతులను చితకబాదుతున్నారని మండిపడ్డారు. మోదీకి ఏ దేవుడైన రైతులను చితక బాదమని చెప్పారా? అని ప్రశ్నించారు.
Read also: Rahul Gandhi: లంచాలు, కమీషన్ల కోసమే ఎలక్టోరల్ బాండ్లు.. కేంద్రంపై రాహుల్ ఆగ్రహం..
పురాతనమైన దేవాలయాలను, మసీదులను మోదీ తొవ్విస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గోతులు తొవ్వడమే అవుతుందని అన్నారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉంటే .. ఎందుకు ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదొస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ బానిస కాబట్టి ఆ ప్రభుత్వం జోలికి పోలేదన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు అడార ఆరోపించారు. భారత దేశం చరిత్రలో బెయిల్ పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. 17ఏ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి చంద్రబాబు కేంద్రానికి దాసోహం అంటున్నారని తెలిపారు. టిడిపి,వైసిపి రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని తెలిపారు. విభజన హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బిజెపి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy: సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నాడు.. హరీష్ రావు పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు