
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో తేదీన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్‌ను ప్రారంభించారు. కాగా, కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిగేలా సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Read also: PM Modi: నేడు నోఖ్రా సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం.. తెలంగాణకు కరెంట్
మరోవైపు బీసీ కుల గణనపై ప్రభుత్వం ఇవాళ సభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. అలాగే సాగునీటిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. నేడు సాగునీటిపై లఘు చర్చ జరగనుంది. సాగునీటిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న ప్రభుత్వం కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టగా, కాగ్ నివేదికలోనూ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్ ప్రస్తావించింది. నేడు సాగునీటి చర్చలో కాగ్ నివేదిక ప్రధాన అస్త్రంగా మారనుంది. మేడిగడ్డ కుంగిన ప్రక్రియపై ప్రభుత్వం సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. దీనిపై స్వల్పకాలిక చర్చ కూడా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కుల గణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. నిజానికి ఈ తీర్మానాన్ని గురువారమే సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చాలాసేపు సాగినా కుదరలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
OG Movie : పవన్ కళ్యాణ్ మూవీ నుంచి కొత్త ఫోటో వచ్చేసింది..