Leading News Portal in Telugu

CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..



Cm

Telangana Assembly: ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టున్న ఇబ్బందులు తొలగించడానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ నియమించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ గత సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది.. కేసీఆర్ వేసిన కమిటీనే ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు సాధ్యమని రిపోర్ట్ ఇచ్చింది.. గతంలో వాస్తవాలతో కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారు అని ఆయన పేర్కొన్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ కట్టాలనేది కేసీఆర్ ఆలోచన చేశారు.. దాంతో కమిటీ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టారు.. ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు పెట్టే ప్రయత్నం చేశారు.. కానీ, వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం.. రాప్తాడు సభ తర్వాత మరింత ఊపు..!

ఇక, తెలంగాణ ఇచ్చింది మేమే.. తెలంగాణ తెచ్చినోళ్లు మావాళ్లే అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే బారిన పడ్డది మా కాంగ్రెస్ ఎంపీలే అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. తప్పు ఒప్పుకోండి కప్పిపుచ్చుకోకండి అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణ తీరని ద్రోహం చేశారు అని ఆయన ఆరోపించారు. ఇక, తెలంగాణకు నీళ్లిచ్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని చెప్పుకుంటున్నారు.. నెమలికే కేసీఆర్ నాట్యం నేర్పినట్లు మాట్లాడుతున్నారు.. దోచుకోవాలి, దాచుకోవాలన్న ఆలోచనతో దర్మార్గానికి ఒడిగట్టారు.. ఎవరు మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారు అని సీఎం రేవంత్ అన్నారు.

Read Also: Ola : త్వరపడండి.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 25000 తగ్గింపు

అయితే, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కళంకంగా మారింది.. ప్రజలను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు.. కూలిన ప్రాజెక్టును చూసి మీరు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు. హరీశ్ రావు సాగునీటి మంత్రిగా కొనసాగించి.. ఆ తరువాత ఎందుకు బర్తరఫ్ చేశారు అని ప్రశ్నించారు. ఈ పాపాలన్నింటికి కేసీఆర్, హరీశ్ రావే కారణం.. తెలంగాణ రాష్ట్రానికి చెదలు పట్టించారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.