
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో అధికార- ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాసనసభలో ఇవాళ నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ప్రవేశ పెట్టాగా.. దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్పించుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీటిరంగంపై చర్చ కొనసాగాలని తెలిపారు. పాపాల భైరవుడు కేసీఆర్‌ను సభకు పిలవాలి అని ఆయన కోరారు. ముఖం లేక అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.. హెలికాప్టర్‌లో కూర్చోని నల్లగొండకు పోవచ్చు కానీ, సభకు మాత్రం రాలేరా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ నల్లగొండను నాశనం చేశారన్నారు.. మాపై మాట్లాడిన బాష దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎంను, తనను కూడా అరే తురే అంటున్నారు.. అన్ పార్లమెంటరీ భాష మాట్లాడారని సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.. అయితే, వెంకట్ రెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sandeep Reddy Vanga : ఒకవేళ వాళ్ళు నన్ను ఆపితే హాలీవుడ్ కి వెళ్ళిపోతా..
కాగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు స్పీకర్ ను కోరారు. దీంతో కాంగ్రెస్- బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక, హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేతపై మాట్లాడిన బాషను బేషరత్తుగా ఉపసంహరించుకోవాలన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలన్నారు. కోమటిరెడ్డి మంత్రిగా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధం కాదన్నారు. బయట మాట్లాడిన మాటలను సభలో మాట్లాడటం సరికాదు అని హరీశ్ రావు అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాల్చిపారేయాలి, ఉరితీయాలి అని అనే విషయాన్ని గుర్తు చేయాలన్నారు.