
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ రవాణా శాఖలో ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ అయ్యేలా రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. అన్ని స్థాయుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్థానచలనం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు(RTO), ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు(DTC) బదిలీ అయ్యారు.
Medaram Jatara : మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేశారు. మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం.
Navi Mumbai: నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్యాక్టరీల్లో మంటలు