Leading News Portal in Telugu

TSPSC : ఫిబ్రవరి 20న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌



Tspsc

డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నగరంలోని కమిషన్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం తెలిపింది. ఉదయం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉన్న చెక్‌లిస్ట్ మరియు ధృవీకరణ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి తీసుకురావాలి.

Viral Video: ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకెళ్తున్న పెద్దపులి.. వీడియో వైరల్

కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడ్ అందుకుంటోంది. ఇటీవలే గ్రూప్ 4 ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించగా.. తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (GRL)ను వెబ్ సైట్ లో ఉంచింది. తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి ఉద్యోగ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు 2022లో రాగా… గతేడాది పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేయటం, వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం….తాజాగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో త్వరలోనే జాబితాలను ప్రకటించనట్లు తెలిపింది. కమిషన్ అధికారిక https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో వీటిని చెక్ చేసుకోవచ్చు.

Indrani: స్ట‌న్నింగ్‌గా తొలి సూప‌ర్ వుమెన్ మూవీ ఇంద్రాణి ట్రైలర్