
ఎల్లుండి (20 వ తేదీ)నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు భాగ్యలక్ష్మి ఆలయం లో యాత్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొత్తం 5 యాత్రలు చేపట్టనుంది తెలంగాణ బీజేపీ. అయితే.. ఎల్లుండి నాలుగు చోట్ల నుండి యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుండి కాకతీయభద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఇందులో.. కొమురం భీం క్లస్టర్ యాత్ర ను ప్రారంభించనున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాజరాజేశ్వరీ క్లస్టర్ యాత్ర ను ప్రారంభించనున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. కొమరం భీం క్లస్టర్, ముధోల్ లో ప్రారంభం బోధన్ లో ముగింపు నిర్వహించనున్నారు. ఇది 21 అసెంబ్లీ లు, 3 పార్లమెంటులను(అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్) కవర్ చేస్తుంది.
Sleeping Tips : రాత్రి మంచి నిద్ర రావాలంటే తిన్న తర్వాత 30 నిమిషాలు ఇలా చేయండి..!
రాజరాజేశ్వరి క్లస్టర్ వికారాబాద్ జిల్లాలోని తాండూర్లో ప్రారంభమై కరీంనగర్లో ముగుస్తుంది. ఇది 4 పార్లమెంటులు(చేవెళ్ల, జహీరాబాద్, మెదక్, కరీం నగర్), 28 అసెంబ్లీ లను కవర్ చేస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్.. భువనగిరిలో ప్రారంభం హైదారాబాద్ లో ముగింపు. ఇది 3 పార్లమెంటులు, 21 అసెంబ్లీ కవర్ చేస్తుందన్నారు. కాకతీయ, భద్రాద్రి క్లస్టర్.. భద్రాచలంలో ప్రారంభం ములుగులో ముగింపు ఇది 3 పార్లమెంటులు(ఖమ్మం, మహబూబ్ బాద్, వరంగల్), 21 అసెంబ్లీ లను కవర్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కృష్ణమ్మ క్లస్టర్ మక్తల్ లో ప్రారంభం నల్గొండలో ముగింపు.. మూడు పార్లమెంట్ నియోజక వర్గాలు(మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,నల్గొండ), 21 అసెంబ్లీ నియోజక వర్గాలు… రెండు లక్ష్యాలతో యాత్ర… మోడీ నాయకత్వాన్ని బలపరచడం, కాంగ్రెస్ కపట హామీలను ఎండగట్టడమై ప్రజలకు వివరించేందుకు అని బీజేపి శ్రేణులు వెల్లడించారు. మార్చి ఒకటి న యాత్రలు ముగియనున్నాయి.
Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..