Leading News Portal in Telugu

Hyd Boy Murder Mystery: దుర్గానగర్‌ బాలుడి మర్డర్ మిస్టరీ.. హత్యచేసింది అతనా..!



Durganagar Boy Dead Mitory

Hyd Boy Murder Mystery: హైదరాబాద్‌లోని దుర్గానగర్ ప్రాంతంలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధుడిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక వృద్ధుడితో కలిసి బాలుడు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైంది. బాలుడి అంత్యక్రియల అనంతరం నిందితుడు ఆ ప్రాంతానికి తిరిగి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తానే హత్య చేసినట్లు వృద్ధుడు అంగీకరించడంతో వారు షాక్‌కు గురయ్యారు. బాలుడిపై అత్యాచారం చేసి, ఎదురు తిరిగితే చంపేశానని ఒప్పుకున్నాడు.

Read also: Jio New Plan 2024: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్‌.. అదనపు డేటా, 14 ఓటీటీలు ఫ్రీ!

జూబ్లీహిల్స్‌లోని దుర్గానగర్‌లో గత బుధవారం నాలాలో బాలుడు శవమై కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 5వ రోడ్డులోని దుర్గాభవానీనగర్ బస్తీలో నివాసముంటున్న ముదావత్ రమేష్, కవిత దంపతుల రెండో కుమారుడు కార్తీక్ అలియాస్ పాండు(10) గత మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం స్థానికులు వెతకగా పార్కులోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. బాలుడిని ఎవరో హత్య చేశారని తల్లి ఆరోపించింది. ఇదే బస్తీకి చెందిన మన్యం నాయక్ (42) గత కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. 15 రోజుల క్రితం బస్తీకి బాలుడిని కలిశాడు. అయితే గతంలో బాలుడి కుటుంబంతో గొడవలు జరిగినట్లు గుర్తించారు.

Read also: MLC Kavitha: ఆ.. జీవోను తక్షణమే వెనక్కి తీసుకోండి.. ఖర్గే కు ఎంఎల్‌సీ కవిత లేఖ

బాలుడు మృతి చెందినప్పటి నుంచి ఫోన్‌లో కూడా నాయక్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చింది. బాలుడి అంత్యక్రియల అనంతరం కొండపైకి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు గత మంగళవారం రాత్రి పార్కులో ఆడుకుంటున్న బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలుడు ఎదురు తిరగడంతో గొంతు నులిమి రాయితో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కుమారుడి ద్వారా పోలీసులు నేరం వివరాలు రాబట్టారు. చిన్నారులపై అత్యాచారం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి భార్య చనిపోయిన తర్వాత ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
YCP- TDP Rebel MLAs: టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే