Leading News Portal in Telugu

TS PECET 2024: ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల..



Ts Pecet

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు అందించే రెండు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd), రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) కోర్సులలో ప్రవేశానికి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2024 (TS PECET-2024) షెడ్యూల్‌ విడుదల అయింది.

Hyderabad: ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం..

కాగా.. టీఎస్‌పీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న రానుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 14 నుంచి మే 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి. జూన్ 10 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

టీఎస్‌పీఈసెట్ షెడ్యూల్:
మార్చి 12న నోటిఫికేషన్
మార్చి 14 నుండి మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
జూన్ 10 నుండి 13 వరకు ఎంట్రెన్స్ పరీక్షలు

PM Modi: భారత్ అభివృద్ధి గురించి విదేశాలు చర్చించుకుంటున్నాయి