
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపారు. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఈసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు.. ప్రభుత్వం వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.