
రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. అందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలు రేపటి నుండి వచ్చే నెల 2 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 5 యాత్రలు ఉంటాయని అన్నారు. రేపు 4 యాత్రలు ప్రారంభం అవుతాయని.. ఆ తర్వాత కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర తరవాత ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా.. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కొమురం భీం యాత్రను బాసర నుండి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రారంభించనున్నారని.. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్రను తాండూర్ లో కేంద్రమంత్రి బిఎల్ వర్మ ప్రారంభించనున్నారు. భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాదాద్రి భువనగిరిలో ప్రారంభిస్తారు. కృష్ణమ్మ యాత్రను మక్తల్ కృష్ణ గ్రామంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారు. పెద్ద బహిరంగ సభలు ఉండవని.. రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. 5 వేల 500 కిలోమీటర్ల మేర యాత్రలు ఉంటాయని అన్నారు. మొత్తం 800 కార్యక్రమాలు… 106 చిన్న సభలు, 102 రోడ్ షోలు, 79 ఈవెంట్స్, 140 స్వాగత కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఒక్కో యాత్ర రోజు రెండు లేదా మూడు అసెంబ్లీలు కవర్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
TSPSC: గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు.. టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం
కొమరం భీం విజయ సంకల్ప యాత్ర
ముధోల్లో ప్రారంభం బోధన్లో ముగింపు.
1056 కిలోమీటర్లు.
ఇది 21 అసెంబ్లీలు, 3 పార్లమెంట్లు(అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్) కవర్ చేస్తుంది.
రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రారంభమై కరీంనగర్‌లో ముగుస్తుంది.
1,022 కిలోమీటర్లు.
ఇది 4 పార్లమెంట్లు(చేవెళ్ల, జహీరాబాద్, మెదక్, కరీంనగర్) 28 అసెంబ్లీలను కవర్ చేస్తుంది.
భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర
భువనగిరిలో ప్రారంభం హైదరాబాద్లో ముగింపు.
ఇది 4 పార్లమెంటులు, 28 అసెంబ్లీలను కవర్ చేస్తుంది.
కాకతీయ-భద్రాద్రి విజయ సంకల్ప యాత్ర
1015 కిలోమీటర్లు 7 రోజులు.
భద్రాచలంలో ప్రారంభం.. ములుగులో ముగింపు.
ఇది 3 పార్లమెంటులు(ఖమ్మం, మహబూబ్ బాద్, వరంగల్) 21 అసెంబ్లీలను కవర్ చేస్తుంది.
కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర
మక్తల్లో ప్రారంభం.. నల్గొండలో ముగింపు.
మూడు పార్లమెంట్ నియోజక వర్గాలు(మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ) 21 అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్ చేస్తుంది.