
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇద్దరు డీఈలపై వేటు పడింది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఈ గోపాలకృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు సస్పెన్షన్ అయ్యారు. కాగా.. ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర విద్యుత్ సరఫరాలో గోపాలకృష్ణ నిర్లక్ష్యం బయటపడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా గోపాలకృష్ణ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఇంతకుముందు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అలానే కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
TS PECET 2024: ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల..
మరోవైపు మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు.. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్య పాత్ర వహించడంతో ఆయనకు వేటు తప్పలేదు. చేసిన నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు.. సైబర్ సిటీ, నల్లగొండ ఎస్ఈలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. దక్షిణ డిస్కం సీఎండి మూష్రాఫ్ అలీపై కఠిన చర్యలు తీసుకోనుంది.
Bigg Boss Vasanthi : ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి వేడుక..వైరల్ అవుతున్న ఫోటోలు..