
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాగా.. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. మొదట మంటలు ఓ గ్యాస్ వెల్డింగ్ షాపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Hyderabad: ప్రాణం తీసిన పంటి వైద్యం..!
ఇకపోతే.. వేసవి కాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అగ్ని ప్రమాద నివారణ చర్యలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Vijay TVK Party: 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీ తొలి సమావేశం