Leading News Portal in Telugu

ACB Raid in Hyderabad: రూ. 84 వేలు లంచం తీసుకుని.. పట్టుబడగానే గుక్కపట్టి ఏడ్చేసిన అధికారిణి



Acb Raids

ACB Raid in Hyderabad: ప్రభుత్వ అధికారి ఒకరు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ట్రైబల్ వెల్ఫేర్ పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న జగజ్యోతి ఏబీ అధికారులకు చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు తన వల్ల అంత డబ్బులు ఇవ్వలేనని అధికారిని వేడుకున్నాడు. అయినా ఆమె వినలేదు రూ.84 వేలు తెచ్చి ఇవ్వాల్సిందే అని కరాఖండిగ చెప్పింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జగ్ జ్యోతి తనకు రూ. 84 వేలు లంచం డిమాండ్ చేస్తుందని తన దగ్గర అంతలేదని వాపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు. ప్లాన్ ప్రకారం జగ్ జ్యోతి దగ్గరకు బాధితున్ని రూ.84వేలు ఇవ్వాలని కోరారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అధికారులు చెప్పినట్లే బాధితుడు జగ్ జ్యోతి దగ్గరకు వెళ్లి తను తెచ్చుకున్న రూ.84వేలు తనకు ఇచ్చాడు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు సెకెండ్ లో అక్కడకు హాజరయ్యరు. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు పట్టుపడగానే గుక్కపట్టి ఏడ్చేసింది. ఆమె ఆఫీసు, ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. జగ్‌జ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటిలో65 లక్షల రూపాయల నగదు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. జ్యోతి ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మందుల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారిని సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో లచ్చునాయక్ తన నివాసంలో వెంకన్న వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Pawan Kalyan: రెండో రోజు రాజమండ్రిలో పవన్ పర్యటన.. పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ..