
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Read Also: CM Revanth: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలి.. సీఎం విజ్ఞప్తి
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. 3 స్థానాలకు ముగ్గురే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇటీవల రాజ్యసభ ఎన్నిలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్లు వేశారు. అయితే వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించడంతో.. ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Also: Rajahmundry Rural: రాజమండ్రి రూరల్ జనసేనకే.. అభ్యర్థి ఖరారు..!