Leading News Portal in Telugu

TS EAPCET 2024: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసింది..



Ts Emcet

తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు.. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జెఎన్టియు హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చెయ్యనున్నట్లు ప్రెస్ నోట్ లో ఉంది.. TS EAPCET 2024 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

ఈ పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు 26 ఫిబ్రవరి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పరీక్షల గురించి పూర్తి సమాచారం కోసం https://eamcet.tsche.ac.in/ ని సందర్శించగలరు.. తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను రాసే అభ్యర్థులు ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ నాలుగు వారాల పాటు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుందని ముందుగా తెలుసుకోవాలి..

ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 26 నుండి అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పరీక్షలకు సంబందించిన పత్రాలను, రిజిస్ట్రేషన్ ఫీజును సమర్పించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పరీక్ష కోసం లింక్ రిజిస్టర్ గడువు వరకు అధికార వెబ్ సైట్ లో వివరంగా ఉంటుంది.

Ts Empcet

Ts Empcet