Leading News Portal in Telugu

Mulugu: మేడారం వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర గాయాలు



Road Accidentf

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. వెంటనే వారిని ములుగు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: Revanth Reddy: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చజెండా..

గాయపడిన వారి స్వస్థలం జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెలపోగులకు చెందిన వారిగా గుర్తించారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ గాయపడిన వారి కుటుంబీకులు, బంధువులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పిన కూడా కొద్దిసేపు వరకు ఆందోళన కొనసాగించారు. అనంతరం వారిని అక్కడ నుంచి పంపించారు. మరోవైపు మేడారం జాతరకు వెళ్లే భక్తులు వాహనాలల్లో జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: Kejriwal: ఇండియా కూటమికి పెద్ద విజయం.. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సీఎం