
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. నిన్న మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా లేనట్టు రెండు రోజులుగా ఆసుపత్రిలో చేరింది జ్యోతి. ఏసీబీకి పట్టుబడిన వెంటనే అస్వస్థత పేరు చెప్పి ఆసుపత్రిలో చేరిన జ్యోతి.. మొదటగా ఛాతి నొప్పంటూ డ్రామాలు ఆడింది. దీంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నార్మల్ గా రావడంతో కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు. మళ్లీ.. గుండెనొప్పి అంటూ నాటకమాడింది. చివరకు అవన్నీ డ్రామాలు అని తెలిసి అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.
Read Also: Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు.. కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా..? చంద్రబాబుకా?
కాగా.. ఈరోజు జ్యోతిని ఉస్మానియాలో చికిత్స కోసం ఏసీబీ అధికారులు ఆమెను తీసుకొచ్చారు. జ్యోతి ఆరోగ్యంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి డిశ్చార్జ్ చేసింది. దీంతో జ్యోతిని ఉస్మానియా హాస్పిటల్ నుండి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఏసీబీ న్యాయస్థానంలో జ్యోతిని హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు.
Read Also: Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటి..
ఇదిలా ఉంటే.. జ్యోతి రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కోటిన్నర రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఫ్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు.