Leading News Portal in Telugu

Hyderabad: నిద్రిస్తున్న వ్యక్తి.. ఇల్లు కూల్చివేసిన అధికారులు.. ఆ తర్వాత ?



Hyderabad

Hyderabad: నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. కూల్చివేతకు ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఇల్లు ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా కూల్చివేత పనులు చేపట్టగా, భోజన విరామ అనంతరం ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. అయితే ఆ ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోన నిదిరించాడు. అతడు లోన ఉన్న విషయం తెలియకుండా ఇంటిని పూర్తిగా కూల్చివేయటంతో, స్వామి రెడ్డి శిథిలాల కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Tunnel Roads: హైదరాబాద్ లో 5 టన్నెల్ రోడ్లు.. మూడు మార్గాల్లో 39 కి.మీటర్లు మేర సొరంగం

కూల్చి వేస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చిన తాగి మరీ ఖాళీ చేయించిన ఇంట్లోనే స్వామి రెడ్డి ఎందుకు పడుకున్నాడు. కుటుంబ విభేదాలతో ఇక్కడకు వచ్చి నిద్రపోయాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోనంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ మాట్లాడుతూ.. తను ముందుగానే తన పాత ఇంటిని ఖాళీ చేయాలని చెప్పానని తెలిపారు. అయితే నిన్న కూల్చివేస్తున్నప్పుడు కూడా ముందుగానే ఇంటిని పరిశీలించామని అన్నారు. అయితే స్వామి రెడ్డి ఎప్పుడు వచ్చి ఇంటిలో పడుకున్నాడో మాకు తెలియదని కొనియాడారు. ముందుగా సమాచారం ఇచ్చాము కాబట్టే ఇంటిని కూల్చివేసామని అందులో స్వామి రెడ్డి మృతితో తమకు సంబందం లేదని అన్నారు. మరి వీటిపై పోలీసులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Satya Pal Malik: జమ్మూ కాశ్మీరు మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ సోదాలు