Leading News Portal in Telugu

K. Laxman: మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగింది..!



K Laxamn

K. Laxman: మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్ లు సైతం అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మన్ సంచలన వాఖ్యాలు చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం దిగ్భ్రాంతి కి గురి చేసిందన్నారు. కుటుంబానికి సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తున్ననని తెలిపారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు దిగ్విజయంగా జరుగుతున్నాయి… ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ రోజు వరకు 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పూర్తి అయిందన్నారు. దేశం కోసం మోడీ… మోడీ కోసం మేము అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దివ్యమైన రామాలయం కట్టిన మోడీ నీ మేము ఎలా కాదంటాము అని అంటున్నారని అన్నారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట ను కాంగ్రెస్ బహిష్కరించడం ను మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Read also: Akash Deep: ఆకాష్‌ దీప్‌ను వెంటాడిన దురదృష్టం.. క్లీన్‌ బౌల్డ్‌ చేసినా దక్కని వికెట్! వీడియో వైరల్

మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్ లు సైతం అంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందన్నారు. యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం సహకరించక పోయినా ఎంఎంటీఎస్ రెండో ఫేస్ ను కేంద్రం ప్రారంభించిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం, గిరిజన వర్సిటీ, రైల్వే లు, జాతీయ రహదారులు కోసం మోడీ ప్రభుత్వం వేల కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వస్తుందన్నారు. మోడీ అభివృద్ది, సంక్షేమం గురుంచి స్పందించకుండా సీఎం, మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Narayanaswamy: జగన్ ను దించాలని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నారు..