Leading News Portal in Telugu

MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు



Lasya

MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని.. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు. డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఎడమవైపు ఉన్న ఓఆర్ఆర్ మెటల్ బీమ్‌కి ఢీకొట్టాడని పోలీసులు పేర్కొన్నారు. అధిక వేగంతో మెటల్ బీమ్‌కు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు.

Read Also: Lasya Nanditha Last Rites: ముగిసిన లాస్య నందిత అంత్యక్రియలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..”రాత్రి 11 గంటలకి ఇంటి నుంచి లాస్య నందిత బయలుదేరింది.. కారులో సదాశివపేటలోని మిస్కిన్ షా బాబా దర్గాను దర్శించుకున్నారు. హైదరాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి కార్లలో వస్తున్నారు. షామీర్‌పేట వద్దకు చేరుకోగానే అల్పాహారం కోసం ఔటర్ రింగ్ రోడ్డు మీదికి వెళ్లారు. అల్పాహారం కోసం ఔటర్ రింగ్ రోడ్డు మీదకి లాస్య నందిత కారు వెళ్ళింది.సుల్తాన్‌పూర్‌ టోల్ ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. నిద్రమత్తులోకి వెళ్లడంతో డ్రైవింగ్‌పై కంట్రోల్ తప్పి ఓఆర్ఆర్ మెటల్ బీమ్‌ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన డ్రైవర్ ఆకాష్‌ను శ్రీకర్ ఆస్పత్రిలో చేర్పించాం” అని పోలీసులు వివరించారు.