
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. 543 ఎంపీ స్థానాల్లో ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. దీని కోసం వ్యూహాలను రచిస్తోంది. వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితానను విడుదల చేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
Read Also: Fuel prices: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం.. హింట్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..
మరోవైపు పార్లమెంట్‌కి ఎక్కువ మంది ఎంపీలను పంపే ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై ఈ రోజు బీజేపీ సమావేశాలు నిర్వహించింది. శనివారం ఉత్తర్ ప్రదేశ్‌పై జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య మరియు బ్రజేష్ పాఠక్ మరియు మంత్రి ధరంపాల్ సింగ్ హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో బీజేపీ 62 సీట్లను గెలుచుకుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ ఇంఛార్జులు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్‌తో పాటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు.