
మహాలక్ష్మి పథకం అమలు తరువాత కూడా ఆటో కొనుగోలు పెరిగాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆటో కార్మికులకు ఆర్ధిక సాయంపై సమీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల జనగణనపై బీహార్‌లో చేసిన విధానంపై అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఏజీతో కూడా మాట్లాడుతున్నాం సమస్యలు రాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా.. ? ఏవిధంగా చేయాలి అనేది త్వరలో క్లారిటీ వస్తోందన్నారు. కుల జనగణన చేసి.. ఎవరు ఎంతో.. వాటా అంత అనే దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
RC 16: రామ్ చరణ్,బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..
పదవులు.. బడ్జెట్ వాటా కూడా అలాగే కేటాయించాలి అనేది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన అన్నారు. బీజేపీ బీసీ సీఎం అన్నారని, కానీ lop కూడా ఇవ్వలేదు.. అది వాళ్ళ చిత్తశుద్ధి అని ఆయన విమర్శలు గుప్పించారు. కవిత నోటీసులు.. వాయిదా పద్దతిలో వస్తున్నాయని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. నోటీసులు వచ్చాయన్నారు. వీఐపీల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ పెడుతున్నామని, లైవ్ టెస్ట్ చేయించి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మూడు.. నాలుగు రోజుల్లో టెస్ట్ ప్రారంభిస్తామని, డీజీపీ.. ఎస్పీ లకు లేఖ రాస్తున్నామన్నారు. ఆర్టీసీ కండక్టర్.. డ్రైవర్లపై వచ్చే ఫిర్యాదుల పై ఆదాలత్ పెడతామని, కండువాలు మార్చినంత మాత్రాన నేరం మారదన్నారు. బస్సుల కనెక్టివిటి పెంచుతామన్నారు.
YV Subba Reddy: తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు