Leading News Portal in Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?



Whatstoday

1. నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్‌-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్‌-2 పరీక్ష. గ్రూప్‌-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు.

2. నేడు కాకినాడలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రారంభం. నేడు యానం ప్రభుత్వ ఆస్పత్రిలో జిప్మర్‌ మల్టీ స్పెషాలిటీ యూనిట్‌ ప్రారంభం. వర్చువల్‌గా ప్రారంభించనున్న మోడీ.

3. నేడు ఖమ్మంలోని కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం పర్యటన. సింగరేణి సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభిచనున్న భట్టి విక్రమార్క.

4. నేడు గజ్వేల్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్పయాత్ర. విజయ సంకల్పయాత్రలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తూప్రాన్‌లో రోడ్‌ షో.. గజ్వేల్‌లో బహిరంగ సభ.

5. భద్రాద్రిలో నేటి నుంచి బీజేపీ 5వ విజయ్‌ భారత్‌ సంకల్ప యాత్ర. భద్రాచలంలో ప్రారంభించనున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి. భద్రాచలం, పినపాక, కొత్తగూడెంలో జరగనున్న సంకల్పయాత్ర.

6. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,000 లుగా ఉంది.

7. నేడు బీజేపీలోకి ఎన్‌ఆర్‌ఐ గొలగాని. పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరనున్న గొలగాని.

8. నేడు బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశాలు. నాగర్‌కర్నూలు, అచ్చంపేటలో సమావేశాలకు హాజరుకానున్న కేటీఆర్‌.