Leading News Portal in Telugu

Hussain Sagar: సాగర్‌లోకి మురుగు నీరు.. జలావరణానికి ప్రమాదముంటున్న పీసీబీ నివేదిక



Hussain Sagar

Hussain Sagar: హైదరాబాద్ మహా నగరంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో మురుగు నీరు స్వేచ్చగా కలిసిపోయి నీరు కలుషితంగా మారిపోతోంది. ఇటీవల పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ విడుదల చేసిన నివేదికలోనూ అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల హుస్సేన్ సాగర్‌లో జీవనం ప్రమాదంలో పడిందని తేలింది. కాగా.. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా.. నీటి నాణ్యత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహానగరంలో నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లో మురుగునీరు స్వేచ్చగా ప్రవహించడంతో నీటి నాణ్యత క్షీణిస్తోంది. దీనికి తోడు బంజారా నాలా ద్వారా విడుదలయ్యే శుద్ధి చేయని డ్రైనేజీ నీరు, మురుగులో ఉండే కాలుష్య కారకాలు, మెటాలిక్ సమ్మేళనాలు కారణంగా రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటుంది. 2023లో తయారు చేసిన పీసీబీ నివేదిక ప్రకారం.. హుస్సేన్ సాగర్‌కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత అధ్వాన్నంగా ఉంది.

Read also: Srisailam: శ్రీశైలంలో ఆర్జిత సేవలన్నీరద్దు.. ఎప్పటి నుంచి అంటే..!

ప్రధానంగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తో పాటు సాలిడ్ వేస్ట్, కోలిఫాం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, నీటి pH స్థాయి 6.63-7.63 మధ్య స్థిరంగా ఉండగా, అధిక విద్యుత్ వాహకత (EC) విలువ నీటిలోని ఖనిజ లవణాలకు విలక్షణమైనది, PCB వర్గాలు వెల్లడించాయి. పిసిబి వర్గాల ప్రకారం, నీటి నాణ్యత క్రమంగా క్షీణించడానికి ప్రధాన కారణాలు శుద్ధి చేయని మురుగునీరు మరియు మానవ వ్యర్థాల పరిమాణం. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే నీటి పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగునీటితోనే హుస్సేన్ సాగర్ లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ జలాలను కాపాడాలంటే సమర్థవంతమైన ఎస్టీపీలతో పాటు, నిరంతరం ప్రవహించే మంచినీరు లేదా 100 శాతం శుద్ధి చేసిన మురుగునీటితో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా.. వీటితో పాటు ప్రతి సంవత్సరం వేసవిలో నీరు ఆవిరైపోతుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
TSPSC Group 2024: గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!