Leading News Portal in Telugu

MLC Kavitha: ఆతల్లి ఏపీ రాష్ట్రానికి అండగా ఉంటుంది.. కోనసీమలో కవిత పర్యటన



Mlc Kavitha

MLC Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి.గన్నవరం మండలం ముంగండ అనే గ్రామానికి వచ్చారు. ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులంతా ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగుతూ ఆనందించారు. కవితో కాసేపు ముచ్చటించారు. దర్శనానంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

Read also: KTR: అంత్యక్రియలకు రాలేకపోయా.. లాస్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్..

ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అలాంటి ఆలయ పునర్విభజనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం శుభపరిణామమన్నారు. బ్రిటీష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని కొనియాడారు. తల్లి ముత్యాలమ్మ ముంగండ గ్రామాన్నే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని కవిత అన్నారు. ఏపీ రాష్ట్రానికి ఆ తల్లి ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అమ్మవారి కృపతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ముత్యాలమ్మ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించిన ముంగండ గ్రామస్తులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమగా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు.
Air India Saftey Mudras: ఎయిర్ ఇండియా వినూత్న ఆలోచన.. నృత్య రూపంలో భద్రతా ప్రదర్శన