Leading News Portal in Telugu

YS Sharmila: షర్మిలక్క కొడుకు పెళ్లి వీడియో చూశారా.. విజయమ్మ డ్యాన్స్ హైలైట్



Raja

YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 16 నుండి 18 వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా 16వ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం జరిగింది. 17వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా వివాహవేడుకలో ఒకటి అయ్యారు. అనంతరం హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ ను నిర్వహించారు. ఇక తాజాగా రాజా, ప్రియ ల పెళ్లి వీడియోను షర్మిల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రాజా, ప్రియ హల్దీ దగ్గరనుంచి సంగీత్, మెహందీ, పెళ్లి మొత్తం చూపించారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నూతన వధూవరులు ఉండగా.. మిగిలినవారందరూ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కనిపించారు.

ఇక సంగీత్ లో వధూవరుల డ్యాన్స్ అదరగొట్టేశాడు. కొడుకు, కోడలితో పాటు షర్మిల కూడా స్టెప్స్ వేసింది. ఇక వీరందరితో పాటు షర్మిల తల్లి విజయమ్మ కూడా ఒక స్టెప్ వేయడం హైలైట్ గా మారింది. పెళ్లి తరువాత.. వధూవరుల ముత్యాల తలంబ్రాలను పోసుకున్నారు. అంతేకాకుండా బిందెలో నుంచి రింగ్ తీయడం, పూల బంతిని విసురుకోవడం చూడముచ్చటగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి అమెరికాకు వెళ్లగా.. అక్కడ ప్రియా పరిచయం అయ్యారు. మొదట స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆపై ప్రేమికులుగా మారారు. రాజా, ప్రియా ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు అంగీకారంతో ఒక్కటి అయ్యారు.