ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చిన్నచిన్న మనస్పర్ధాలకే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో తొందరపాటు నిర్ణయం వల్ల విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. అంతేకాకుండా.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తే.. భర్త గొడవ ఎందుకులేనని అనుకువుగా ఉన్నా, భార్య మాత్రం ఓ పట్టు పట్టాల్సిందే అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో భార్యల చేతుల్లో చెంపదెబ్బలు, చీపురుదెబ్బలు.. ఇలా రకరకాల దెబ్బలు తినాల్సి వస్తుంది.
Read Also: PM Modi: రూ. 41వేల కోట్ల విలువైన రైలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే.. భర్తలను భార్యలు చితకబాదడం కామన్ అయిపోయింది. అదే భర్త భార్యను ఏమైనా అంటే పెద్దపెద్ద గొడవలు అవుతాయని కామ్ గా ఉంటే.. భార్యల చేతుల్లో భర్తలు చావుదెబ్బలు తింటున్నారు. విశ్వవ్యాప్తంగా భార్యలదే డామినేషన్. కాగా.. భార్యల చేతుల్లో భర్తలు చావుదెబ్బలు తింటున్నది ఎక్కువ తెలంగాణలోనే నంట. బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాగా.. దెబ్బలు తింటున్న వారిలో ఎక్కువగా తాగుబోతులు, నిరక్షరాస్యులు ఉండటం గమనార్హం. దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.
Read Also: Pawan Kalyan: డబ్బు కోసం పవన్ ఆ పని కూడా చేయనున్నాడట.. ?
గత 15 ఏళ్ల నుంచి చూసుకున్నట్లైతే.. భర్తలపై దాడులు ఐదింతలు పెరిగాయని అధ్యయనం తెలిపింది. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలను చితకబాదుతున్నారని అధ్యయనంలో తెలిసింది. 2006 సంవత్సరంలో మాత్రం ఈ సంఖ్య ఏడు మాత్రమే కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం కూడా పురుషులపై గృహహింస పెరగడానికి ఒక కారణమని అధ్యయనం పేర్కొంది. అయితే ఎక్కువగా మద్యానికి బానిసైన భర్తలు భార్యలను వేధించడమే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది.