Leading News Portal in Telugu

Jagga Reddy: పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గాలంటే.. రాహుల్‌ ప్రధాని కావాలి..



Jagga Reddy

Jagga Reddy: రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడోలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరని అన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళును మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయం చేస్తోంది బీజేపీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడి కట్టండి.. దేవుడి గుడి కూడా రాజకీయానికి వాడుకోవాలని బీజేపీ చేస్తోందని అన్నారు. ఎమోషన్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపి అన్నారు.

Read also: Maratha Reservation Protest: మహారాష్ట్రలో రిజర్వేషన్ మంటలు.. బస్సును తగలబెట్టిన నిరసనకారులు

దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నేతలు..పెట్రోల్..డీజిల్..నిత్యవసర ధరల గురించి మాట్లాడరని మండిపడ్డారు. ధరల పెరుగుదల పై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డికి లేదన్నారు. ప్రజలను మోసం చేసే మాటలు బీజేపీ చెప్తుంది ప్రజలు గమనించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు. 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నారు. మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి.. హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలిపించండి.. మంచి రోజులు వస్తాయని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత బీజేపీ ఎప్పుడో విస్మరించిందని మండిపడ్డారు.
Alleti Maheshwar Reddy: ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే..