
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణలో మరో రెండు పథకాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎవరూ మర్చిపోలేని రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లకార్డు ఉన్న వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్ళుగా యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు వాడారో అన్ని సిలిండర్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, భవిష్యత్ లో తెల్ల కార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉన్న మిగతా వారికి కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాలోకి ఇప్పుడు లేని వారిని తర్వాత చేర్చుతామని ఆయన తెలిపారు.
Hyderabad: మిక్చర్ బయట షాపుల్లో కొంటున్నారా? ఇది తెలిస్తే జన్మలో కొనరు..
అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండు గ్యారెంటీలు ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం మిగతా హామీలు అమలు చేస్తామన్నారు కొండా సురేఖ. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న సీఎం, ఆమె స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీలను కూడా కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ పథకంలో లోపాలు గుర్తించి మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తామని వెల్లడించారు. పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా అభయ హస్తం గ్యారంటీలు ప్రకటించినట్లు పునరుద్ఘాటించారు.
Gaami : విశ్వక్ సేన్ గామి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?