
కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యేనన్నారు. ఇప్పటి వరకు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ఎక్కడా కూడా ఇంత వెనుకబడి పరిస్థితి కనిపించలేదన్నారు వెంకట రమణ. రాజకీయం వేరు..పరిపాలన వేరని, మంత్రి గా ఉన్న జూపల్లి నోరు జారీ మాట్లాడుతున్నాడన్నారు. పేరు కృష్ణా రావు.. కానీ మనిషి మాత్రం రావణాసురుడని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి కర్రు కాల్చి వాత పెట్టాలి అని జూపల్లి మాట్లాడుతున్నాడన్నారు. కనీసం మోదీ దగ్గరకు కూడా నువ్వు వెళ్ళలేవన్నారు. ఇలాగే మాట్లాడితే ప్రజలే నీకు కర్రు కాల్చి వాత పెడతారు గుర్తు పెట్టుకో అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నాయన్నారు.
Pakistan: రావి నది ప్రవాహాన్ని నిలిపేసిన భారత్.. ఇది “వాటర్ టెర్రరిజం” అంటూ పాక్ గగ్గోలు..
మరి ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కోసమైనా అప్లికేషన్ చేశావా..? అని ఆయన ప్రశ్నించారు. చెట్లు సంపద కూడా ఎక్కువగానే ఉందని, మరి పేపర్ మిల్లు ల్కు ప్రతిపాదన చేసి ఉపాధి కోసం ఎందుకు ఆలోచించడం లేదన్నారు వెంకట రమణ రెడ్డి. అందరూ గోడలు దూకే నాయకులే ఇక్కడ ఉన్నారని, ఈ రోజు తిట్టిన పార్టీలోకే రేపు వెళ్లి చేరుతున్నారన్నారు. ఈ సారి రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పి బిజెపి జెండా నాగర్ కర్నూల్ లో ఎగరవేయడానికి సిద్ధం గా ఉన్నారని, ప్రజలు తలుసుకుంటే కామారెడ్డి రిజల్టే నాగర్ కర్నూల్ లో కూడా వస్తుందన్నారు. మూడో సారి కూడా మోది ప్రధాని అవ్వడం కాయమన్నారు.
MP K.Laxman : కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు ఉంది కొత్త మంత్రుల పరిస్థితి