Leading News Portal in Telugu

MP K.Laxman : కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు ఉంది కొత్త మంత్రుల పరిస్థితి



K Laxman On Kcr

కొత్త బిచ్చగాడు పొద్దేరుగడన్నట్లు ఉంది..ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యిన వారు పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్‌. ఇవాళ పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి అయ్యామని అద్ధూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.. వీళ్ళ మారుస్తున్న రంగులు చూసి అంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీ లో ఎందుకు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీఅర్ఎస్ మీద వ్యతిరేకత నే కాంగ్రెస్ నీ అధికారంలోకి తెచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గతంలో 10 సంవత్సారాలు అధికారం లో ఉండి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు చేసిందన్నారు లక్ష్మణ్‌. అంతేకాకుండా.. కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ కి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ఇన్నేళ్ల మళ్ళీ ఇప్పుడు పదేళ్ల తరువాత కొత్త రాజకీయాలు మొదలు పెట్టారన్నారు.

Nandamuri Balakrishna: కన్నప్పలో బాలయ్య.. మంచు విష్ణు భారీ ప్లాన్.. ?

కానీ ప్రజలు కాంగ్రెస్ నీ నమ్మే స్థితిలో లేరని, ఎవరు కూడా పస్తులు ఉండకూడదని ఉచిత బియ్యం అందిస్తుంది బీజేపీ ప్రభుత్వమన్నారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా ఫ్రీగా వ్యాక్సిన్ అందించిన ఘనత మన మోదీది అని ఆయన కొనియాడారు. రైతులకు ఉచిత ఎరువులు అందించి రైతులకు సహకారం అందిస్తున్న ప్రభుత్వం మోడీది అని, అయోధ్య రామా మందిరాన్ని నిర్మించి ఏళ్ల నాటి హిందువుల కల నెరవేర్చింది మోడీదేనన్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళల గోస తీర్చింది కూడా మోడీ ప్రభుత్వమేనని ఆయన ఉద్ఘాటించారు. రాముడే లేడు.. లేని రామునికి గుడెందుకు అని మాట్లాడిన కాంగ్రెస్ నేతలు అని, ఇప్పుడు మాట మార్చి ఓట్ల కోసం దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. మూడో సారి మోది నీ గెలిపిస్తే విశ్వాగురువు గా దేశం ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ తోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేసి మూడో సారి మోడీనీ ప్రధాని చేసి కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత పెట్టడానికి నాగర్ కర్నూల్ ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.

Weather warning: పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే!