
తుక్కుగూడలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రజలకు అంకితం ఇచ్చారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గృహాలక్ష్మీ, మహా లక్ష్మీ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఎలా ఇచ్చారో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్నారు. రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పథకాల అమలు కోసం ఆర్థిక వెసులుబాటు అంచనా వేసుకున్నామని, చేవెళ్లలో ఈ కార్యక్రమం లక్ష మంది మహిళాల సమక్షంలో సభ నిర్వహించుకుందామని అనుకున్నాన్నారు రేవంత్ రెడ్డి. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నాము. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, యుపిఎ ప్రభుత్వం నాడు పేదల కష్టాలు తీర్చాలని భావించి గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకు వచ్చారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచుకుంటూ పోయింది. రాష్ట్రంలో వాటి ధర తగ్గించ కుండా కేసీఆర్ జిఎస్టీ రూపంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు.
Citizenship Rules: 3 దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం.. వచ్చే నెలలో సీఏఏ రూల్స్ అమలు.?
అంతేకాకుండా. ‘నాటి కేసీఆర్ ప్రభుత్వం సిలిండర్ ధరలు తగ్గించాలని అనుకోలేదు. మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ క్రమశిక్షణ అవలంభిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ప్రజలు ఎవరు మామా అల్లుళ్ళు, తండ్రి కొడుకుల మాట ఎవరు నమ్మరు. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియాగాంధీ. సోనియాగాంధీ మాట శిలా శాసనం. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నాం.. హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం.. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.