
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు జరగనున్నాయన్నారు. మోడీ సర్కార్ 3వ సారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలందరి మనసులో మోడీయే రావాలని ఉందని, కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల అవీనితి జరిగిందన్నారు. అనాడు సోనియా రిమెట్ కంట్రోల్‌లో మన్మోహన్ సింగ్ పనిచేశారని, ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోడీ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. మోడీ సమర్ధవంతమైన నాయకుడని, 500 ఏళ్ల కల అయినా అయోధ్య రామాలయాన్ని మోడీ నిర్మించారన్నారు. అధికారంలోకి వస్తే రామమందిరం నిర్మిస్తామని చెప్పామని, నిర్మించామన్నారు. ఇది మోడీ వల్ల సకారమైందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచారు మోడీ అని, అలాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో 17కు 17 బీజేపీ గెలవాలని, మజ్లీస్ సీటు కూడా బీజేపీ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. అసదుద్దీన్ పార్లమెంట్‌కు వెళ్ళకుండా అడ్డుకోవాలని, మజ్లీస్ పార్టీ ప్రజా సామ్యానికి, అభివృద్ది్కి వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. మెట్రో రైల్‌ను అడ్డుకుంది.. మజ్లీస్ అని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచనా మజ్లిస్ చేరి, పోలీసు వ్యవస్థను తన అధీనంలో పెట్టుకుంటుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలని ప్రజలను కొరుతున్నానని, ముఖ్యంగా బీజేపీకి హైదరాబాద్ నుండి ఓ ఏంపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.