Leading News Portal in Telugu

Ponnam Prabhakar: ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బండి సంజయ్ పై పొన్నం ఫైర్



Ponnam Prabhakar Vs Bandi Sanjay

Ponnam Prabhakar: నాలుక.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెపారని అన్నారు. నిన్న ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ ని ప్రశ్నించానని అన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు బండి సంజయ్ ఏం చేసారు? అని మండిపడ్డారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాదు.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఎన్నడూ ఆటువంటి మాటలను, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి నేను మాట్లాడలేదని అన్నారు. నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం సభ్య సమాజాన్ని కొరుతున్నా అన్నారు. జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయిన..ఇంకా ఎవరి తల్లి అయిన తల్లే కదా అన్నారు. రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినది అయితే.. అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబందించిన మాట.. సమాజం గమనించాలని తెలిపారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ.. యాత్రని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు.

Read also: CM Revanth Reddy: ఏ సమయమైనా సహకరిస్తాం.. ఫార్మా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి హామీ

బండి యాత్ర కి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలెపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బండి యాత్రలు అడ్డుకోవడం లేదు.. ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందన్నారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని అంటున్నారన్నారు. ప్రజలే మనకు చట్టం ప్రహాస్వామ్యమే మనకు చట్టమన్నారు. ఈ ప్రజల ముందు నేను అడుగుతున్నానని తెలిపారు. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ పై ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. భార్యకి మంగళ సూత్రం కడతారు.. అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి బండి సంజయ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీ రాముడు అంటే ఎంత గౌరవం.. ఆనాడు ఆయోధ్య రాముడిగా సీతమ్మ కోసం పడ్డ కష్టం తండ్రి మాటకు కట్టుబడి విలువిచ్చి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు.. నా తల్లి జన్మ గురించి మాట్లాడితే ఎం రాజకీయం అని మండిపడ్డారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలన్నారు. వాళ్ళని అడుగుతున్న ఇటువంటి నాయకునికి డ్రామాలకు సమర్థిస్తున్నారా..? అని ప్రశ్నించారు.

Read also: CM Revanth Reddy: ఏ సమయమైనా సహకరిస్తాం.. ఫార్మా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి హామీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుని అడుగుతున్న ఈ జిల్లాకి సంబంధించిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనేం చేశాను ప్రజలు గమనించాలన్నారు. మీరు నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. ఈ మాట ఆనాడు కేసీఆర్ హిందుగాల్లు.. బొందుగాళ్ళు.. అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నారో అని గుర్తు చేశారు. తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్.. జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. మేము హింసావాదులం కాదు.. శవం మీద పేలాలు ఏరుకునే రకం కాదు.. యాత్ర చేసుకో ఏమైనా చేసుకో అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం.. మేము యాత్రకి అడ్డుపడతలేం.. నాలుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Sridhar Babu: కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం..