Leading News Portal in Telugu

TS Govt: డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం



Ts Dsc

పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్‌ పోస్టులతో రేపు కొత్త నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.

Read Also: Kishan Reddy: అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కాంగ్రెస్ దందా మొదలు పెట్టింది..

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు.

Read Also: Congress: హిమాచల్ చేజారితే.. ఈ రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్‌కి దిక్కు..